Govardhan Devarakonda: మా అబ్బాయి డబ్బులెందుకివ్వాలి?
అభిషేక్ పిక్చర్స్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా (abhishek nama) కొంతకాలంగా విజయ్ దేవరకొండపై (vijay devarakonda) ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు అభిషేక్ ఎవరు తన అబ్బాయిని అనడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ తండ్రి గోవర్ధన్ దేవరకొండ (govardhan devarakonda). అభిషేక్‌కి విజయ్ ఎందుకు డబ్బులివ్వాలి అని ప్రశ్నించారు. ఒకవేళ విజయ్ నిజంగా డిస్ట్రబ్యూటర్లను మోసం చేసి ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి పాపులర్ అవ్వాలని అనుకోరని అన్నారు.
“” అసలు అభిషేక్ నామా ఎవరు నా కొడుకు గురించి మాట్లాడటానికి. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో నిర్మాత కేఎస్ రామారావుతో అభిషేక్‌కు ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయి. ఆ గొడవని మా అబ్బాయి వైపు డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. అభిషేక్‌కి మా నుంచి రావాల్సింది ఏమీ లేదు. అయినా మేం అతనితో టచ్‌లో ఉన్నామంటే అది మా మంచితనం. సునీల్ నరంగ్ మంచి డిస్ట్రిబ్యూటర్. అతనితో కలిసి విజయ్ తప్పకుండా సినిమా చేస్తాడు. కానీ అభిషేక్‌తో మాత్రం ఇక ఎటువంటి సంబంధాలు లేవు. అతనిది మోసపు బుద్ధి బయటపడింది. వరల్డ్ ఫేమస్ లవర్ టైంలో విజయ్‌కి రెమ్యునరేషన్‌గా రామారావు ఒక ఫ్లాట్ ఇచ్చారు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో మేం ఆ ఫ్లాట్‌ని తీసుకోలేదు “”
“” అభిషేక్ ఎప్పటినుంచో మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడని అతని నుంచి తప్పించుకోవడానికి మేం త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలీ పేర్లను వాడాల్సి వచ్చింది. అసలు ఖుషి సినిమా కలెక్షన్స్‌తో అభిషేక్‌కి ఏం పని? విజయ్ సినిమాలు బాగా ఆడటం లేదు అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అన్నప్పుడు మళ్లీ విజయ్‌తో ఎందుకు సినిమా తీయాలని అనుకుంటున్నాడు. ఇక్కడే అతని బుద్ధి బయటపడింది. అతనికి మేం ఏమన్నా డబ్బులు బాకీ ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలా ఇంటర్వ్యూలు ఇస్తే కుదరదు “” అని మండిపడ్డారు గోవర్ధన్. (govardhan devarakonda)