Gopala Gopala 2: కృష్ణుడిగా ఫ్యాన్స్‌కి ఓకే అయితేనే..!

Hyderabad: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), వెంక‌టేష్ (venkatesh) న‌టించిన గోపాల గోపాల (gopala gopala) సినిమా ఫ్లాప్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని దేవుడిగా చూపించ‌డం ఫ్యాన్స్‌కి న‌చ్చ‌లేదేమో ఏమో కానీ హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన‌ప్ప‌టికీ తెలుగులో పోయింది. అక్ష‌య్ కుమార్ న‌టించిన ఓ మై గాడ్ సినిమాకు గోపాల గోపాల రీమేక్‌గా వ‌చ్చింది. అయితే గోపాల గోపాల పార్ట్ 2 (gopala gopala 2) వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయా అంటే ఉన్నాయ‌నే చెప్పాలి. డైరెక్ట‌ర్ కిశోర్ కుమార్ పార్థ‌సానికి ఈ సినిమాకు పార్ట్ 2 తీయాల‌ని ఉంద‌ట‌. కానీ ప్ర‌భాస్‌ని (prabhas) రాముడి గెట‌ప్‌లో చూపించిన‌ట్లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) శ్రీ కృష్ణుడి గెట‌ప్‌లో చూపిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తామంటేనే ఈ సినిమా సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాస్తాన‌ని అంటున్నారు కిశోర్‌. ఫ్యాన్స్‌కి న‌చ్చ‌క‌పోతే ఎలాంటి ప్లాన్లు చేయ‌లేన‌ని చెప్తున్నారు.

ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే ప‌వ‌న్‌ను ఇప్ప‌టివ‌ర‌కు మాస్‌గా ఉంటేనే ఇష్ట‌ప‌డ్డారు. లేదా క్లాస్‌గా క‌నిపించినా యాక్సెప్ట్ చేస్తారు కానీ మ‌రీ శ్రీ కృష్ణుడి గెట‌ప్‌లో అంటే డౌటే. అందుకే గోపాల గోపాల సినిమాలో కూడా ఫ్యాన్స్ ఊరుకోరేమోన‌ని జ‌స్ట్ ప‌వ‌న్‌ను శ్రీ కృష్ణుడి గెట‌ప్‌లో ఊహించుకునేలా తీసారే త‌ప్ప మేక‌ప్ వేసి డైరెక్ట్ కృష్ణుడి గెట‌ప్‌లో చూపించ‌లేదు.