Venkat Prabhu: ధోనీ వ‌ల్లే తెలుగులో GOAT సినిమా ఆడ‌లేదు

goat director says goat did not work in telugu because of dhoni

Venkat Prabhu: ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన గోట్ (GOAT) సినిమా ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఇది త‌మిళ చిత్రం కాబ‌ట్టి త‌మిళ‌నాడులో బాగా ఆడింది. కానీ తెలుగు, హిందీ మార్కెట్ల‌లో సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగు, హిందీ మార్కెట్ల‌లో సినిమా ఫ్లాప్ అవ‌డం ప‌ట్ల వెంక‌ట్ ప్ర‌భు స్పందించారు. సినిమాలో మ‌హేంద్ర సింగ్ ధోనీ కేమియో రోల్ ఉంద‌ని.. ఆ రోల్ తెలుగు, హిందీ ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌కపోవ‌డం వ‌ల్లే గోట్ ఫ్లాప్ అయ్యింద‌ని అన్నారు. కానీ తాను ధోనీ ఫ్యాన్ అని.. సినిమాలో ధోనీ ఉండ‌టం తెలుగు, హిందీ ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌క‌పోతే తాను ఏమీ చేయ‌లేన‌ని అన్నారు. ధోనీకి కేవ‌లం త‌మిళ‌నాడులోనే అభిమానులు ఉన్నార‌ని వెంక‌ట్ ప్ర‌భు భ్ర‌మ ప‌డుతున్నార‌ని.. త‌మ‌కు విజ‌య్ నచ్చ‌క సినిమా చూడ‌లేద‌ని తెలుగు ఆడియ‌న్స్ ట్విట‌ర్‌లో కౌంట‌ర్లు వేస్తున్నారు.