Gautami: చంపేస్తామంటూ బెదిరింపులు.. ఫిర్యాదు చేసిన న‌టి

ప్ర‌ముఖ న‌టి గౌతమి (gautami) పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఆమెకు ఆమె కూతురు సుబ్బ‌ల‌క్ష్మికి ఓ వ్య‌క్తి నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని త‌మిళ‌నాడు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. అల్ల‌గ‌ప్ప‌న్ అనే బిల్డ‌ర్.. త‌న సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి రూ.25 కోట్ల వ‌ర‌కు మోసానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు.చెన్నై సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును టేక‌ప్ చేసారు. (gautami)