Gabbar Singh Sai: నేను చ‌చ్చినా అల్లు అర్జున్‌తో క‌లిసి న‌టించ‌ను

gabbar singh sai sensational words on allu arjun

Gabbar Singh Sai: గ‌బ్బ‌ర్ సింగ్‌లో న‌టించిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ సాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమానిన‌ని.. సినిమాల్లో అయినా రాజ‌కీయాల్లో అయినా త‌న మ‌ద్ద‌తు ప‌వ‌న్‌కే అని తెలిపారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేనకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేత కోసం ప్ర‌చారం చేసిన అల్లు అర్జున్‌తో తాను చ‌చ్చినా న‌టించ‌ని.. ఆ అవ‌కాశం వ‌చ్చినా వ‌దులుకుంటాన‌ని అన్నారు. అల్లు అర్జున్ విషయంలో నాగ బాబు చెప్పింది క‌రెక్టే అని మ‌న‌వాడు కాక‌పోయినా మ‌న కోసం నిల‌బడితే అత‌ను ప‌రాయి కాద‌ని.. మ‌న‌వాడు మ‌న కోసం నిల‌బ‌డ‌క‌పోతే వాడు క‌చ్చితంగా ప‌రాయివాడే అని అన‌డంలో ఏమాత్రం త‌ప్పు లేదంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు.