G.O.A.T: అబ్బో.. ఓ రేంజ్‌లో సుధీర్ సినిమా టైటిల్!

Hyderabad: సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) జంటగా నటిస్తున్న సినిమా SS4. డైరెక్టర్‌ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రామా నాయుడు స్టూడియోస్​లో ఘనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రెగ్యులర్​ షూటింగ్​ని కూడా ప్రారంభించేశారు మేకర్స్​. కాగా, ఈరోజు సుధీర్ బర్త్ డే సందర్బంగా టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ను లాంఛ్ చేశారు. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి G.O.A.T : Greatest Of All Times (ట్యాగ్‌లైన్‌) టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

గతేడాది ‘గాలోడు'(Gaalodu)తో థియేటర్లలో సందడి చేసిన సుధీర్ తన నెక్స్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. తన మొదటి సినిమా అయిన ‘బ్యాచిలర్’ తో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది దివ్యభారతి. ఆ తర్వాత రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.