Re Release: సినిమా పోయినా నో ప్రాబ్లం..!
గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) యాక్ట్ చేసిన పోకిరి (pokiri) సినిమాను రీమాస్టర్డ్ వెర్షన్‌గా రీ రిలీజ్ (re release) చేసారు. ఆయన బర్త్‌డే సందర్భంగా దానిని మళ్లీ రిలీజ్ చేస్తే అభిమానులు పాత రోజుల్లోకి వెళ్లిపోయి తెగ ఎంజాయ్ చేసారు. అక్కడి నుంచి మొదలైంది రీ రిలీజ్‌ల పర్వం. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్‌లతో ఒకటే మ్యూజిక్. అఫ్‌కోర్స్ అన్ని రీ రిలీజ్‌లు వృధా అని కాదు. ఒకప్పుడు మంచి కంటెంట్ ఉన్నా ఫ్యాన్స్‌కి ఎందుకో నచ్చక ఆడని సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్.. ఆరెంజ్. అప్పట్లో రిలీజ్ చేస్తే ఎవ్వడూ పట్టించుకోలేదు. ఇప్పుడు నిర్మాత నాగబాబుకు ప్రత్యేకంగా రిక్వెస్ట్‌లు పెట్టి మరీ రీ రిలీజ్ చేయించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజే వేరు. (re release)
బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేసే దగ్గర నుంచి అసలు ఇప్పుడు కూడా ఎవడూ పట్టించుకోని అట్టర్ ఫ్లాప్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే దాకా వచ్చింది ఈ ట్రెండ్. రానున్న నెలల్లో వరుసగా 12 నుంచి 15 సినిమాలు మళ్లీ రిలీజ్ అవబోతున్నాయి. వాటిలో అట్టర్ ఫ్లాప్ అయినవి, అసలు ఫ్యాన్స్ కూడా కావాలని అనుకోనివి రీ రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. అసలు ఎవరు అడిగారు అన్ని రిలీజ్‌లు? ఎందుకు మళ్లీ ఫ్లాప్ సినిమాలను రుద్దాలని చూస్తున్నారు? అన్ని ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అనే గ్యారెంటీ లేదు.
మొన్న ఇలాగే బాలకృష్ణ నటించిన పాత సినిమాను రీ రిలీజ్ చేస్తే అసలు థియేటర్ మొత్తం ఖాళీగా ఉందట. అలాంటప్పుడు ఎందుకు ఈ డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియాలి. ఏమన్నా అంటే ఫ్యాన్స్ కోరిక మేరకు అంటున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు రీ రిలీజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎంత మంది ఫ్యాన్స్ అలా అడుగుతున్నారు? మెజారిటీ ఏంటి? అని అస్సలు పట్టించుకోవడంలేదు. ఏదో ఒక పది మంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్‌లు రాగానే రీ రిలీజ్ అనే పోస్టర్ వదులుతున్నారు. (re release)
దాని వల్ల ఇప్పుడు మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమాలపై ప్రభావం చూపుతోంది. నిన్న బిగ్ బాస్ మాజీ విన్నర్ సొహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రిలీజ్ అయింది. ఆయన కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌పై ఆవేదన వ్యక్తం చేసారు. శుక్ర, శని, ఆదివారాల్లో కాకుండా మిగతా రోజుల్లో రీ రిలీజ్‌లు వేసుకోండి అని రిక్వెస్ట్ చేసారు. ఆయన బాధలో కూడా ఒక అర్థం ఉంది. మొన్న ప్రభాస్ నటించిన యోగి సినిమాను రీ రిలీజ్ చేసారు. అసలు ఎవరు అడిగారో ఏమో డిస్ట్రిబ్యూటర్‌కే తెలియాలి. ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసారు. ఎంత బాగా అంటే.. థియేటర్ స్క్రీన్‌ను చించేసారు. కొన్ని రీ రిలీజ్‌ల సమయంలో అయితే థియేటర్‌లోని కుర్చీలు విరగ్గొట్టారు. వచ్చే కలెక్షన్ ఏమో కానీ వాటి రిపేర్‌కు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటోందని థియేటర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (re release)
రానున్న రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండబోతోందంటే.. ఇప్పుడు రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు ఫ్లాప్ అయితే.. ఇంకో ఐదేళ్ల తర్వాత రీ రిలీజ్ చేసే పరిస్థితి వచ్చేలా ఉంది. మొన్న రిలీజ్ అయిన భోళా శంకర్ బాలేదు అన్నారు. అంతకుముందు రిలీజ్ అయిన శాకుంతలం, లైగర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఐదేళ్ల తర్వాత ఇవే సినిమాలు రీ రిలీజ్ అవుతాయని కచ్చితంగా చెప్పచ్చు. ట్రెండ్ అలా ఉంది మరీ. కాబట్టి ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని హీరోలు, నిర్మాతలు ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. కొన్ని ఏళ్ల తర్వాత పోయిన కలెక్షన్లు వసూలు అవుతాయిలే..!