Tiger Nageswar Rao:మాస్​ మహారాజ​ కోసం ఐదుగురు హీరోలు!

Hyderabad: మాస్​ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswar Rao) . ఈ ఏడాది రావణాసుర(Ravanasura)తో అభిమానులను నిరాశ పరిచిన రవితేజ ఈ చిత్రంతో ఎలాగైనా సక్సెస్​ ట్రాక్​ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. 70ల్లో జీవించిన ఓ వ్యక్తి జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వంశీ(Vamsee) రూపొందిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్‌, నుపూర్‌ సనన్‌ నాయికలుగా నటిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ పాత్రను పరిచయం చేసేందుకు వివిధ భాషల నుంచి స్టార్​ హీరోలు రవితేజకు అండగా నిలిచారు
తమిళంలో కార్తి(Karthi), మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan), కన్నడలో శివరాజ్‌ కుమార్‌(Shiva Raj Kumar), హిందీలో జాన్‌ అబ్రహాం(John Abraham) రవితేజ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్‌(Venkatesh) ‘టైగర్‌ నాగేశ్వరరావు’ను పరిచయం చేస్తారని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. 70వ దశకంలో స్టూవర్ట్‌పురం గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో రాబిన్‌ హుడ్‌ లాంటి దొంగ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నారు.