Fish Venkat: దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న న‌టుడు

fish venkat is looking for financial help

 

Fish Venkat: పెద్ద పెద్ద హీరో సినిమాల్లో కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఎన్నో సినిమాల్లో నటించి అల‌రించిన ఫిష్ వెంక‌ట్‌కు రెండు కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయిందని.. ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని ఆయ‌న‌ కన్నీరు పెట్టుకున్నారు.