Project K: ఓ..K ఓ..K
Hyderabad: ఒక సినిమాకు ఎంత హైప్ క్రియేట్ చేస్తే రిజల్ట్ అంత బాగా ఉండాలి. లేదంటే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఇప్పుడు నాగ్ అశ్విన్ (nag ashwin) చేస్తున్న తప్పు అదే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో (prabhas) ప్రాజెక్ట్ K అనే సినిమాను టేకప్ చేసారు. అసలు ఆ ప్రాజెక్ట్ K అంటే ఏంటో ఎవ్వరికీ తెలీదు. ప్రాజెక్ట్ K అంటే ఏంటి అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. చాలా మంది K అంటే కాలచక్ర అని, కర్ణ అని ఎవరికి వారు ఫిక్స్ అయిపోతున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే.. ఈరోజు సినిమాలో ప్రభాస్ (prabhas) ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసారు. లుక్ చూస్తే చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది కానీ.. బాడీకి ప్రభాస్ ఫేస్‌ని ఎటాచ్ చేసినట్లుగా ఉందని కొందరు ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బాగుంటాయని అంటున్నారు. సినిమాలో హీరోయిన్లలో ఒకరైన దీపిక పదుకొణె (deepika padukone) లుక్ మాత్రం చాలా నేచురల్‌గా బాగా చూపించారు. కానీ ప్రభాస్ లుక్‌ని మాత్రం హైప్ అంతా దిగిపోయేలా చేసారు. కనీసం టైటిల్ గ్లింప్స్‌లో అయినా నాగ్ అశ్విన్ తన ఉగ్రరూపం చూపిస్తారేమో చూడాలి.