Dasara Releases: ద‌స‌రా బొమ్మ‌లు సిద్ధం..!

సాధార‌ణ రోజుల్లో సినిమాలు రిలీజ్  (dasara releases) అయితేనే ఆడియ‌న్స్ ఎంత క‌ష్ట‌మైనా థియేట‌ర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. ఇక పండుగ స‌మ‌యంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేట‌ర్ల వ‌ద్ద క‌నిపించే ఆ సంద‌డే వేరు. కుటుంబంతో సహా వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. ఈ ద‌సరాకు నాలుగు సినిమాలు రిలీజ్ అవ‌బోతున్నాయి. అవేంటంటే..

నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (nelakonda bhagavant kesari)

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (nandamuri balakrishna) న‌టించిన మాస్ సినిమా ఇది. అనిల్ రావిపూడి (anil ravipudi) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ (kajal agarwal), శ్రీలీల (sreeleela) న‌టించారు. ఇందులో శ్రీలీల బాలయ్య చెల్లెలి పాత్ర‌లో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్పుడే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఎందుకంటే సినిమా టైటిల్ పేరు NBK .. NBK అంటే నంద‌మూరి బాల‌కృష్ణ అనే పేరు కూడా వ‌స్తుంది. దాంతో అనిల్ రావిపూడి ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. (dasara releases)

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (tiger nageswara rao)

వ‌రుస ఫ్లాప్‌ల త‌ర్వాత దేశంలోనే అతిపెద్ద దొంగ అయిన స్టూవ‌ర్ట్‌పురం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితాధారంగా తీసిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు మాస్ మహారాజా ర‌వితేజ‌ (ravi teja). ఇందులో రేణూ దేశాయ్ (renu desai) కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం మ‌రో విశేషం. సినిమాకు ఆమె పాత్ర ఎంతో కీల‌కం అని తెలుస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సినిమా ర‌వితేజ కెరీర్‌లోనే తొలి ప్యాన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనే కాకుండా ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం విశేషం. అక్టోబ‌ర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.

లియో (leo)

విక్ర‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో (thalapathy vijay) క‌లిసి లియో సినిమాను ప్లాన్ చేసారు లోకేష్ క‌న‌గ‌రాజ్ (lokesh kanagaraj). ఇందులో విజ‌య్‌కి జోడీగా త్రిష (trisha) న‌టించారు. లోకి సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి రాబోతున్న మ‌రో సినిమా కావ‌డంతో త‌మిళ‌నాట మాత్రం సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లియో సంద‌డి అంతగా క‌నిపించ‌డంలేదు. ఈ సినిమా కూడా అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది.

ఘోస్ట్ (ghost)

క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ (shiva rajkumar) న‌టించిన సినిమా ఇది. జైల‌ర్ (jailer) సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్న శివ‌న్న‌.. ఘోస్ట్ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 19న రిలీజ్ కానుంది. (dasara releases)