Upasana: గేమ్ ఛేంజ‌ర్ అప్డేట్‌పై స్పందించిన ఉపాస‌న‌

fans ask rhyme about game changer update

Upasana: భార‌తీయుడు 2తో డిజాస్ట‌ర్‌ను మూట‌గ‌ట్టుకున్నారు శంక‌ర్. క్లాసిక్ హిట్స్‌ని ట‌చ్ చేస్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో మ‌రోసారి రుజువైంది. దాంతో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అభిమానులు కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నారు. శంక‌ర్ రామ్ చ‌రణ్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే రోజుల నుంచి అస‌లు రిలీజ్ అవుతుందా అనుకునే స్టేజ్‌కి వ‌చ్చేసారు ఫ్యాన్స్.

శంక‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్‌ల‌ను అప్డేట్ అడిగితే ఎటూ చెప్ప‌ర‌ని తెలిసి పాపం ఫ్యాన్స్ చ‌ర‌ణ్ పెంపుడు కుక్క అయిన రైమ్‌ను అడుగుతున్నారు. రైమ్‌కి ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దానికి కూడా చాలా మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే కొంద‌రు ఫ్యాన్స్ గేమ్ ఛేంజ‌ర్ అప్డేట్ గురించి చ‌ర‌ణ్‌ను అడిగి తెలుసుకుని త‌మ‌కు చెప్పాలంటూ రైమ్ ఖాతాలో కామెంట్స్ పెడుతున్నార‌ట‌. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న స్పందించారు. రైమ్‌ని గేమ్ ఛేంజ‌ర్ అప్డేట్ అడిగితే పాపం అదెలా చెప్తుంది. అదేమ‌న్నా సినిమాకు నిర్మాతా? లేకా డైరెక్ట‌రా? అంటూ ఫ‌న్నీ కామెంట్ చేసారు.