Vikram: మీరంతా ఉండ‌గా.. నాకేం అవుతుంది!

Chennai: న‌టుడు చియాన్ విక్ర‌మ్(chiyaan vikram) ఇటీవ‌ల షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తంగలాన్(thangalaan) సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న కింద‌ప‌డిపోయారు. దాంతో ప‌క్క‌టెముక విరిగింది. వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. స‌ర్జ‌రీ చేసామ‌ని, త్వ‌ర‌లో ఆయ‌న కోలుకుంటార‌ని వైద్యులు తెలిపారు. అయితే శివ అనే ఓ అభిమాని ఆయ‌న ఇంటికి వెళ్లాడు. త్వ‌ర‌గా కోలుకోండి విక్ర‌మ్ అని రాసి ఉన్న ప్లకార్డు ప‌ట్టుకుని చాలా సేపు విక్ర‌మ్ ఇంటి ముందే వెయిట్ చేసాడ‌ట‌. విష‌యం తెలుసుకుని విక్ర‌మ్ ఆ అబ్బాయిని ప‌ల‌క‌రించారు. త‌న‌కోసం ఇంత‌గా వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. మీరంతా నాకు అండ‌గా ఉండ‌గా నాకేం అవుతుంది అని విక్ర‌మ్ ట్వీట్ చేసారు.