Shruti Haasan.. నువ్వు డ్ర‌గ్స్ తీసుకుంటావా?

Hyderabad: సెల‌బ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటారు. అప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారు. నిన్న శృతి హాస‌న్ (shruti haasan) ఇదే విధంగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసారు. కొన్ని ప్ర‌శ్న‌లు బాగానే ఉన్నాయి కానీ.. ఏదో ఒక నెగిటివ్ ప్ర‌శ్న లేదా కామెంట్ లేకుండా ఉండ‌దు క‌దా..! ఓ నెటిజ‌న్‌.. శృతి.. మీరు డ్ర‌గ్స్ తీసుకుంటారా? అని అడిగాడు. ఇందుకు శృతి స్పందిస్తూ.. అస్స‌లు లేదు. నేను క‌నీసం మందు కూడా తాగ‌డంలేదు. ఈ డెసిష‌న్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా అని బ‌దులిచ్చారు. ఇక శృతి (shruti haasan) సినిమాల విష‌యానికొస్తే.. వాల్తేరు వీర‌య్య‌ (waltair veerayya), వీర సింహారెడ్డి (veera simha reddy) సినిమాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బస్ట‌ర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో (prabhas) క‌లిసి స‌లార్ (salaar) సినిమాతో బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) డైరెక్ట్ చేస్తున్నారు.