Janavule song: నాక్కూడా న‌చ్చ‌లేదు

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), సుప్రీం స్టార్ సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) న‌టించిన సినిమా బ్రో (bro). త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వినోద‌య సీతం సినిమాను తీసిన‌ స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani) ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేసారు. ఇందులో ప‌వ‌న్ దేవుడి క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. నిన్న జాన‌వులే (janavule) అనే పాట‌ను రిలీజ్ చేసింది టీం. ఇందులో ధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న కేతిక శ‌ర్మ (ketika sharma) న‌టించింది. అస‌లు ఆ సాంగ్ ఏంటో.. ఆ లిరిక్స్ ఏంటో.. ఆ డ్యాన్స్ ఏంటో.. అనుకుంటూ ఫ్యాన్స్ త‌ల‌బాదుకుంటున్నారు. త‌మ‌న్‌కు (thaman) ఈ మధ్య ఏమైందో అని తిట్టుకుంటున్నారు. అయితే ఈ సాంగ్‌లో త‌న డ్యాన్స్ స్టెప్పుల‌పై ధ‌ర‌మ్ తేజ్ స్పందించారు. పాట‌లో తాను చేసిన డ్యాన్స్ త‌న‌కు కూడా న‌చ్చ‌లేద‌ని అన్నారు.

ఆడియన్స్‌కే కాదు.. నాక్కూడా జాన‌వులే పాట‌లో నా డ్యాన్స్ న‌చ్చ‌లేదు. కానీ ఇప్పుడు ఏమీ చేయ‌లేం క‌దా. ఇప్పుడు నేను నా హెల్త్‌పై ఫోక‌స్ చేయ‌డానికి కొంత‌కాలం బ్రేక్ తీసుకుంటున్నా. త‌ర్వాత సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయబోతున్నా. ఈ సినిమాలో నేను వేయ‌బోయే స్టెప్పులు పాత సినిమాల్లో కంటే బెస్ట్‌గా ఉంటాయ‌ని మాటిస్తున్నా  అని అన్నారు.