తల్లి చేత సెక్స్ సీన్లు చేయించిన ద‌ర్శ‌కుడు

Elizabeth Hurley: హాలీవుడ్ సినిమాల్లో సెక్స్ సీన్లు చాలా కామ‌న్. ఈ సీన్లు లేక‌పోతే అస‌లు వారికి సినిమానే లేదు. కానీ ఓ ద‌ర్శ‌కుడు తాను తీసిన సినిమాలో క‌న్న త‌ల్లి చేత సెక్స్ సీన్లు చేయించ‌డం అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డ్యామియ‌న్ హ‌ర్లే అనే హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల ఓ సినిమా తీసాడు. అందులో డ్యామియ‌న్ త‌ల్లి ఎలిజ‌బెత్ కూడా నటించారు. అయితే ఇందులో ఎలిజ‌బెత్ చేత చాలా మ‌టుకు సెక్స్ సీన్ల‌లో న‌టించ‌మ‌ని అడిగాడు డ్యామియ‌న్. ఇందుకు ఎలిజ‌బెత్ కూడా ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం అక్క‌డ స్థానికంగా వైర‌ల్ కావ‌డంతో వారు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తాము తీసిన సినిమాలో త‌ప్పేమీ లేద‌ని చెప్పాల్సి వ‌చ్చింది.

డ్యామియ‌న్ త‌న‌తో కొడుకులా కాకుండా త‌మ్ముడిలా అనిపిస్తాడ‌ని.. అలాంటి సీన్ల‌లో న‌టించ‌డం త‌న‌కు త‌ప్పు అనిపించ‌లేద‌ని ఎలిజ‌బెత్ తెలిపారు. దాంతో మీడియా వారంతా షాకయ్యారు. చాలా కాలంగా డ్యామియ‌న్ త‌న బికినీ ఫోటోల‌ను తీస్తున్నాడ‌ని.. ఇది బ‌య‌టి వారికి త‌ప్పుగా అనిపించినా కూడా ఇండ‌స్ట్రీలో చాలా మంది త‌మ‌కు స‌పోర్ట్‌గా నిలిచార‌ని తెలిపారు.