Eagle Review In Telugu: రవితేజ ఈగల్ మెప్పించిందా?
Eagle Review In Telugu: మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) గెలుపు ఓటములను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆయన నటించిన గత సినిమాలు అంతంత మాత్రానే ఆడాయి. చివరగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో కనిపించారు. ఆయన నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు ఫర్వాలేదనిపించింది. ఈరోజు ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
నటీనటులు : రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్
దర్శకత్వం : కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్ : కార్తిక్ ఘట్టమనేని
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
ప్రొడక్షన్ కంపెనీ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
మ్యూజిక్ డైరెక్టర్ : దవ్జండ్
ఈగల్ ఫస్ట్ హాఫ్‌లో రవితేజ సహదేవ్ అలియాస్ ఈగల్ అనే ప్రొఫెషనల్ స్నైపర్‌గా కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ యాక్షన్ సన్నివేశాలతో గడిచిపోయింది. లీడ్ క్యారెక్టర్ చుట్టూ ఉండే సస్పెన్స్ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తుంది. రవితేజ తన వయసుకు తగ్గట్టుగా ఉండే లుక్‌తో కనిపిస్తారు. ఇది ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుంది. యాక్షన్ సన్నివేశాలను బాగా ఎగ్జిక్యూట్ చేసారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ ఓపికను పరీక్షిస్తుంది. అవసరం లేని పాటలు, సన్నివేశాలతో ఇరికించనట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లోనే అంతా ఉంది అన్నట్లుగా ఫస్ట్ హాఫ్‌లో బిల్డప్ ఇచ్చి తీరా చూస్తే ఉసూరుమనిపించేలా సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ఈగల సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది VFX. VFX వాడి తీసిన సన్నివేశాలు వావ్ అనిపించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంలో రవితేజ క్యారెక్టర్ గురించి ఎలివేషన్ ఇవ్వడంతోనే సరిపెట్టేసారు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని.
సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. సూర్య వర్సెస్ సూర్యకి ముందు కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. కార్తిక్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయి చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా హిట్ అవ్వడం వల్లే రవితేజ లాంటి స్టార్ నటుడు ఈగిల సినిమా కథ చెప్పగానే ఒప్పుకున్నారు. ఇక ఇందులో హీరోయిన్లుగా నటించిన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్‌లు తమ నటనతో ఫర్వాలేదనిపించారు. కావ్యకు పెద్దగా సినిమాలో స్కోప్ లేదు. అనుపమ తన క్యారెక్టర్‌కు న్యాయం చేసింది అనిపిస్తుంది.
ఈగల్ సినిమా చుట్టూ పెద్దగా ప్రమోషన్స్ ఏమీ జరగలేదు. సినిమాలో కంటెంట్ ఉంటే దానంతట అదే క్లిక్ అవుతుంది అని పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం ప్లస్ పాయింట్‌గా మారింది. సినిమాలో ఏమీ లేకపోయినా ఎగిరి ఎగిరి ప్రమోషన్స్ చేస్తున్న రోజులు ఇవి. కానీ ఈగల్‌కు అలాంటివేమీ చేయలేదు. కాబట్టి ప్రమోషన్స్ చేసినంతగా సినిమాలో ఏమీ లేదు అనే టాక్ అయితే వినిపించడంలేదు. ట్విటర్‌లో కూడా ఈగిల్‌కు మంచి టాక్ వినిపిస్తోంది. మిక్స్‌డ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. చాలా కాలం తర్వాత రవితేజ తన వయసుకు తగ్గ పాత్ర చేసారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.