తెలుగులో మరో సినిమా ఓకే చేసిన దుల్కర్ సల్మాన్!
Hyderabad: ‘మహానటి'(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). ఈ సినిమాలో జెమినీ గణేషన్‌గా దుల్కర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘సీతా రామం'(Sitaramam) సినిమాతో హీరోగానూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దుల్కర్‌కు మాలీవుడ్‌తోపాటు దక్షిణాది అన్ని భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘కనులు కనులను దోచాయంటే’ కూడా తెలుగులో హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘తొలిప్రేమ'(Toliprema) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి(Venky Alturi)తో దుల్కర్ సల్మాన్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వినబడుతున్నదే అయినప్పటికీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన ధనుష్(Dhanush) ‘సార్’ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సార్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. తాజాగా ప్రకటించిన దుల్కర్ సల్మాన్ సినిమాను కూడా ఆ రెండు సంస్థలే నిర్మిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.