Double Ismart: ఇస్మార్ట్​ శంకర్​ సీక్వెల్​ వచ్చేస్తోంది!

Hyderabad: ఎనర్జిటిక్​ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinivas) రూపొందిస్తున్న ఈ సినిమా RAPO20 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్​ గ్లింప్స్​ని రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న ప్రకటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. తాజాగా రామ్​ బర్త్​డే స్పెషల్​గా మరో గుడ్​ న్యూస్​ ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని​ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2019 లో పూరీజగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్ పై చాలా వార్తలు బయటకి వచ్చాయి.

ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని ప్రకటించడంతో.. కొత్త కథతో వస్తున్నారా? లేదా సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ కి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారా? అనే సందేహం మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ.. ఇస్మార్ట్ కి సీక్వెల్ అని ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్(Double Ismart) అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసిన మూవీ టీం.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న పాన్​ ఇండియా రేంజ్​లో రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు.

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా పాన్​ ఇండియా లెవల్లో తెరకెక్కిన లైగర్ ఊహించని విధంగా ప్లాప్​ అయ్యింది. కాగా, సాలిడ్​ కమ్​బ్యాక్​తో అదరగొట్టాలని పూరీ ప్లాన్​ చెస్తున్నారని తెలుస్తోంది. ఛార్మితో కలిసి ముంబైలో కొన్నాళ్లుగా మకాం వేసిన పూరి జగన్నాథ్ ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కథని ప్రిపేర్ చేసుకుని డెవెలెప్ చేస్తూ.. రామ్ తో మీటింగ్ మొదలెట్టినట్టు టాక్. పూరి-ఛార్మినే పూరీ కనెక్ట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.