Samantha: ఇది త‌ప్పు అనిపించ‌లేదా సామ్?

Hyderabad: మ‌నం ఏదైతే వ‌ద్దు అనుకుంటామో దేవుడు అందులోనే ముంచి లేపుతాడు అన్న ఎగ్జాంపుల్ స‌మంత‌కు (samantha) బాగా స‌రిపోతుంది. ఏ సీన్ అయితే త‌న‌కు ఒక‌ప్పుడు త‌ప్పుగా అనిపించిందో ఇప్పుడు అదే సీన్‌లో సామ్ న‌టించాల్సి వ‌చ్చింది. అస‌లు దేని గురించి ఈ డిస్క‌ష‌న్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకు తెలియాల్సిందే.

అది 2014. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన నేనొక్క‌డినే (nenokkadine) సినిమా రిలీజ్ అయింది. అందులోని ఆ తుజో మోకోర్తా అనే పాటలో హీరోయిన్ కృతి స‌న‌న్.. (kriti sanon)మ‌హేష్ బాబు న‌డుస్తుంటే అత‌ని కాళ్ల వెన‌క పాకుతూ వెళ్లే సీన్ ఉంది. అప్ప‌ట్లో ఈ పాట రిలీజ్ అయిన‌ప్పుడు స‌మంత కామెంట్ చేసింది. ఇంకా రిలీజ్ అవ్వ‌ని సినిమా నుంచి ఓ సీన్ చూసాను. ఆ సీన్ చూసాక మళ్లీ ఆ పాత రోజులను గుర్తుచేసింది అని ట్వీట్ చేసారు. అంటే పాత కాలంలో భార్య‌లు భ‌ర్త‌ల కాళ్ల ద‌గ్గ‌ర ప‌డి ఉండేవారు.. మ‌ళ్లీ ఈ సీన్ అలాంటి రోజుల‌నే గుర్తుచేసింది అని సామ్ అభిప్రాయ‌ప‌డింది. దాంతో అప్ప‌ట్లో అది తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. (samantha)

ఇప్పుడు స‌మంత న‌టించిన ఖుషి (khushi) సినిమాలో అలాంటి సీన్‌లోనే సామ్ న‌టించింది. ఖుషి (khushi) సినిమాలోని ఆరాధ్య పాట రిలీజ్ అయింది. అందులో విజయ్ దేవ‌ర‌కొండ‌.. (vijay devarakonda) సోఫాలో కూర్చుని సామ్ మీద కాలు పెడ‌తాడు. ఇప్పుడు ఆ సీన్‌ను వైరల్ చేస్తూ చాలా మంది నెటిజ‌న్లు సామ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అప్ప‌ట్లో ఆ సీన్ రిగ్రెసివ్ అయిన‌ప్పుడు.. ఇప్పుడు సామ్ చేసింది ఏంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. నేనొక్క‌డినే సీన్ సామ్‌కు త‌ప్పు అనిపించినప్పుడు.. ఆరాధ్య పాట‌లోని సీన్ కూడా త‌ప్పు అనిపించాలి క‌దా? ఈ సీన్ ఇలా వద్దు వేరేలా చేద్దాం అని చెప్పే స్టేజ్‌లో సామ్ ఉంది. (samantha)

ఈ సినిమాకి డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌. ఆల్రెడీ సామ్ శివ నిర్వాణ‌తో క‌లిసి మ‌జిలీ సినిమా చేసింది. క‌లిసి ప‌నిచేసిన డైరెక్ట‌రే కాబ‌ట్టి ఆ చ‌నువుతోనైనా సామ్ ఈ సీన్ వ‌ద్ద‌నో లేదా ఇలా వ‌ద్ద‌నో చెప్పి ఉంటే బ‌హుశా మార్పులు చేసేవారేమో. సామ్ లాంటి టాప్ హీరోయిన్ ఒక చిన్న సజెష‌న్ ఇచ్చిన‌ప్పుడు కచ్చితంగా డైరెక్ట‌ర్లు వింటారు. కానీ సామ్ ఈ సీన్‌లో న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌నే క్లియ‌ర్‌గా తెలుస్తోంది. (samantha)

ఇప్పుడు ఓ రేంజ్‌లో ట్రోలింగ్ అవుతున్నా సామ్ ఇంకా స్పందించలేదు. ఇప్పుడు స్పందించ‌క‌పోయినా ఖుషి సినిమా ప్ర‌మోష‌న్స్ టైంలో ఒక వ‌ర్గానికి చెందిన మీడియా ప్ర‌తినిథులు ఇదే విష‌యాన్ని క‌చ్చితంగా అడుగుతారు. మ‌రి దీనికి స‌మంత ఏమ‌ని స‌మాధానం చెప్తారో వేచి చూడాలి. మ‌యోసిటిస్‌తో బాధ‌ప‌డుతున్న సామ్ త‌న చేతిలో ఉన్న సినిమాల‌న్నీ పూర్తి చేసేసింది. ఇక ఒక ఏడాది పాటు సినిమాల‌కు బ్రేక్ తీసుకోబోతోంది. బ‌హుశా ఖుషి సినిమా ప్ర‌మోష‌న్స్‌కి సామ్ రాక‌పోవ‌చ్చు అన్న టాక్ కూడా టాలీవుడ్‌లో న‌డుస్తోంది.

samantha reacted on this poster
Samantha