Trisha Krishnan బ్యూటీ సీక్రెట్స్ తెలుసా!
Hyderabad: టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా రాణించిన తమిళ బ్యూటీ త్రిష కృష్ణణ్(Trisha Krishnan). నలభై ఏళ్లు దాటినా క్యూట్ లుక్స్‌తో ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ వర్షం(Varsham), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష తొలినాళ్లకంటే ఇప్పుడు మరింత క్యూట్‌గా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది.
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా త్రిష కెరీర్‌కి చాలా ప్లస్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తాజాగా క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) రూపొందించిన పొన్నియన్ సెల్వన్(PS1), పొన్నియన్ సెల్వన్2(PS2)లో తన అందం, అభినయంతో మరోసారి మెప్పించింది త్రిష. దీంతో త్రిష రోజురోజుకీ అందంగా ఎలా కనిపిస్తోందా అని తన ఫిట్నెస్ సీక్రెట్స్(Fitness secrets) తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు అభిమానులు. త్రిష డైలీ రొటీన్, తినే ఆహారం గురించి తెలుసుకుంటున్నారు. త్రిష తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడంతోపాటు ఎక్కడున్నా ఇంటి భోజనమే చేస్తుందట. త్రిషకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. తరచూ బాక్సింగ్ చేయడం వల్ల భుజాలు దృఢంగా మారుతాయి. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడంతోపాటు యోగా కూడా చేస్తుందట. అందుకే నాలుగు పదుల వయస్సులోనూ ఈతరం కుర్రకారును కట్టిపడేసే అందంతో మెరిసిపోతుందన్నమాట.