Kalki 2898 AD: వామ్మో ఇది బ‌డ్జెటా.. క‌లెక్ష‌న్సా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న సినిమాల్లో క‌ల్కి 2898 ఏడి (kalki 2898 ad) ఒక‌టి. నాగ్ అశ్విన్ (nag ashwin) ప్ర‌తిష్ఠాత్మ‌కంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇదొక‌టి. అయితే ఈ సినిమా బ‌డ్జెట్‌కు సంబంధించి ఒక అప్డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. సినిమా టోట‌ల్ బ‌డ్జెట్ రూ.600 కోట్లు. అందులో రూ.230 కోట్లు VFXకే ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. క‌లెక్ష‌న్స్ కూడా ఇదే రేంజ్‌లో ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆచి తూచి సినిమా రావ‌డం కాస్త లేట్ అయినా ఫ‌ర్వాలేదు ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ బ్యానర్‌కు మే 9 అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాను వైజ‌యంతి మూవీసే నిర్మించింది. అప్ప‌ట్లో ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బ‌స్టర్ అయింది. ఆ త‌ర్వాత మ‌హాన‌టి కూడా ఇదే తేదీన రిలీజ్ అయింది. దాంతో ఇప్పుడు క‌ల్కి సినిమాను కూడా 2024 మే 9న రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. (kalki 2898 ad)