Sridevi: శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఇంటికెళ్లి..
Sridevi: మీరు చదివింది నిజమే..! సూపర్‌స్టార్ రజినీకాంత్ అందాల తార శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నారట. శ్రీదేవి అనగానే మనకు గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే శ్రీదేవిని ఆయన ఆరాధించినంత ఆమె భర్త బోనీ కపూర్ కూడా ఆరాధించి ఉండరేమో. శ్రీదేవి చనిపోయినప్పుడు వర్మ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సర్‌గా మారారు. శ్రీదేవి అంటే వర్మకు ప్రాణం అని.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ రజినీకాంత్ కూడా శ్రీదేవిపై మనసు పారేసుకోవడం గురించి విన్నారా? ఈ విషయాన్ని ఎవరో కాదు.. లెజండరీ దర్శకుడు కే. బాలచందర్ అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శ్రీదేవిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ రజినీకాంత్‌కి శ్రీదేవి వయసులో 13 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ తానెంతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రజినీకాంత్ అనుకున్నారట. అలా శ్రీదేవి ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంటే.. అక్కడే ఆమె తల్లిదండ్రులతో మీ అమ్మాయిని నాకిచ్చి చేస్తారా అని అడగటానికి వెళ్లారట. అయితే రజినీ శ్రీదేవి ఇంటికి వెళ్లగానే కరెంట్ పోయిందట. దాంతో ఇది మంచి శకునం కాదేమో అని భావించి రజినీ తన ప్రేమ విషయాన్ని శ్రీదేవికి, ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత రజినీకాంత్ జర్నలిస్ట్‌గా పనిచేసిన లతను వివాహమాడి ఆమెతో ఇద్దరు కూతుళ్లను కన్నారు.