Devara: టాలీవుడ్‌లోనే కాస్ట్లీ హీరోయిన్.. దేవ‌ర‌కు ఎంత తీసుకుందో తెలుసా?

Devara: అల‌నాటి తార శ్రీదేవి (sridevi) కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వి క‌పూర్. ముఖానికి ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు చేయించుకుని ఇప్పుడు కాస్త హాట్ అండ్ గ్లామ‌ర‌స్‌గా త‌యారైంది. తెర‌పై చూడ‌టానికి బాగుంది క‌దా అని వ‌రుస అవ‌కాశాలు చుట్టుముడుతున్నాయి. జాన్వి తెలుగులో న‌టిస్తున్న మొద‌టి సినిమా దేవ‌ర‌ (devara). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు (jr ntr) జోడీగా నటిస్తోంది. ఇది జాన్వికి తొలి తెలుగు సినిమా అయిన‌ప్ప‌టికీ ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చార‌ట నిర్మాత‌లు. ఇంత‌కీ జాన్వి దేవ‌ర కోసం తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.10 కోట్లు అని టాక్. త‌న‌కు బాలీవుడ్‌లో ఎన్నో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతోంద‌ని చెప్పి మ‌రీ రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.