Naga chaitanya: మా విడాకులకు మూడో వ్యక్తితో సంబంధం లేదు
Hyderabad: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(naga chaitanya)ను.. సమంతతో(samantha) జరిగిన విడాకుల(divorce) ప్రశ్నలు ఇప్పటికీ వదలడం లేదు. వారిద్దరూ ఎందుకు విడిపోయారో వారికి మాత్రమే తెలుసు. అయినప్పటికీ ప్రతి సినిమా ప్రమోషన్లో ఈ ప్రశ్న చైతన్యకు ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన కస్టడీ(custody) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలో మళ్లీ విడాకుల గురించి ప్రశ్నలు వచ్చాయి. వాటికి చై చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు.
“ఇప్పటికీ నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మేం విడిపోయి మూడేళ్లు అవుతోంది. మాకు లాస్ట్ ఇయరే కోర్టు విడాకులు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరి జీవితం వారిది. సామ్ కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఆమె చాలా లవ్లీ పర్సన్. కానీ కొందరు మీడియా వర్గాలు మా గురించి రాసే వార్తల కారణంగా మా మధ్య ఉన్న పరస్పర గౌరవం కూడా పోతోంది. అదే నాకు చాలా బాధగా ఉంది. అదీకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం ఉంది అని రాస్తున్నారు. మా విడాకులకు ఆ మూడో వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఆ మూడో వ్యక్తి గురించి తప్పుగా రాసి వారి పరువు తీస్తున్నారు” అని వెల్లడించారు చైతన్య.
అయితే.. ఆ మూడో వ్యక్తి పేరు తీయనప్పటికీ అంతా నటి శోభిత ధూళిపాళ్లే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే.. శోభిత, నాగచైతన్యతో ఎప్పటినుంచో రిలేషన్‌షిప్‌లో ఉందని, వాళ్లు లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లిన ఫొటో కూడా బయటికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఏదేమైనా ఇప్పుడు మాత్రం తాను సింగిల్‌గానే ఉన్నానని కన్ఫామ్ చేసారు నాగచైతన్య.