Vivek Agnihotri: బాలీవుడ్‌లో అంతే.. హత్యలు, రేప్‌లు..!
Mumbai: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri) షాకింగ్ పోస్ట్ చేసారు. ఆయన బాలీవుడ్‌లో ఉండే సెలబ్రిటీలకు కలిగే సౌకర్యాల గురించి పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ప్రముఖ దర్శకుడు నితిన్ దేశాయ్ (nitin desai) ఆత్మహత్య వార్త బయటికి వచ్చిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ వివేక్ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. “” బాలీవుడ్‌లో ఒంటరి మరణాలు. ఈ ప్రపంచంలో ఎంత సక్సెస్ అయినా చివరికి మనం లూసర్స్ మాత్రమే. చివరికి అంతా మన చుట్టూనే ఉంటుంది కానీ మనతో మన కోసం మాత్రం ఏదీ ఉండదు. ప్రతీదీ మనకు వేగంగానే దొరకుతుయి. డబ్బు, పేరు, పలుకుబడి, అభిమానులు, క్రిటిక్స్, అమ్మాయిలు, ఎఫైర్స్ ఇలా బాలీవుడ్‌లో సక్సెస్‌తో ముడిపడేవి అన్నీ తొందరగానే దొరికేస్తాయి. అంతేకాదు.. బాలీవుడ్ మనల్ని విలువలు, ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తుంది. హత్య, ఉగ్రవాదం, రేప్‌లు, డ్రంక్ డ్రైవింగ్.. ఇలాంటి వాటి నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.
ఒక్కసారి డబ్బు రావడం మొదలైందంటే.. అలా వచ్చి పడుతూనే ఉంటుంది. కానీ మనం మిడిల్ క్లాస్‌కి అలవాటు పడి ఉంటాం. దాంతో ఆ డబ్బుతో ఏం చేసుకోవాలో తెలీదు. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లు పెట్టుబడి పెట్టు అని చెప్తుంటారు. కానీ ఎవ్వరూ మనకి చెప్పని విషయం ఏంటంటే.. ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నమ్మకూడదని. ఇక్కడ ఉంటే మేకప్ లేకుండా మన ముఖం మనకే నచ్చదు. ఫ్యాన్స్ లేకపోయినా నచ్చదు. ఆల్రెడీ పేరు తెచ్చేసుకున్నాం కాబట్టి దానిని నిలబెట్టుకోవడానికి మరింత పాకులాడతాం. చివరికి ఫ్యాన్స్ కూడా ఉండరు. కేవలం పైన వేలాడే ఫ్యాన్ మాత్రమే ఉంటుంది. చివరికి ఆ ఫ్యానే ఈ బాధాకరమైన జీవితానికి ముగింపు పలికేలా చేస్తుంది. కొందరు ప్రతిక్షణం చస్తూ బతుకుతూ ఉంటారు. ఇంకొందరు ఉరేసుకుని చస్తుంటారు. ఇది సాధారణమైన ముగింపే “” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.