Teja: ఆ సినిమాతో రామ్​ చరణ్​ అభిమానిగా మారిపోయా!

Hyderabad: జయం, నిజం వంటి సూపర్​ హిట్​ సినిమాలను రూపొందించిన టాలీవుడ్ దర్శకుడు తేజ(Teja). అంతేకాదు కొన్ని వందల మంది ఆర్టిస్టులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్(Daggubati Abhiram)​ను హీరోగా పరిచయం చేస్తూ అహింస (Ahimsa) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు తేజ. జూన్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్(Ram charan) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తేజ.

‘రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన చూసి తనకు అభిమానిగా మారిపోయా. ఇప్పటి జనరేషన్ లో చరణ్ అంటే చాలా ఇష్టం, తన సినిమా చూడడానికే థియేటర్ కి వెళ్తా. నా ఫేవరెట్ మూవీ కూడా రంగస్థలం’అంటూ చెప్పుకొచ్చారు తేజ. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తాను పనిచేసిన హీరోల గురించి కూడా పలు విషయాలను పంచుకున్నారు. తనతో పనిచేసిన హీరోల్లో మహేష్​ ఒక్కడే చెప్పిన దానికి సరిపోయే ఎక్స్​ప్రెషన్స్​ ఇచ్చేవాడని చెప్పుకొచ్చారు.