అర్థ‌రాత్రి Jr NTR ఇంటి ముందు కొర‌టాల‌, అనిరుధ్‌!

Hyderabad: డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ (koratala siva), మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ anirudh ravichander).. నిన్న అర్ధ‌రాత్రి ఎన్టీఆర్ (jr ntr) ఇంటి ముందు క‌నిపించారు. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమా గురించి డిస్క‌స్ చేయ‌డానికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. తారక్‌ను క‌లిసాక అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో కొర‌టాల శివ‌, అనిరుధ్ ఏదో డిస్క‌స్ చేసుకుంటూ క‌నిపించారు. మొన్న తార‌క్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్, పోస్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్‌లుక్‌కే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసారు కొర‌టాల‌. ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చిందంటే.. అనిరుధ్ ఏ రేంజ్‌లో BGM ఇచ్చారో తెలిసిపోతుంది. ఇందులో జాన్వి క‌పూర్ (janhvi kapoor) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) విల‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు.