Harish Shankar: టైటిల్ లీక్ చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నావా?

director harish shankar slams a journalist on twitter

Harish Shankar:  ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి గ్రేట్ ఆంధ్రకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వీరిద్ద‌రికీ ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో గొడ‌వ జ‌రుగుతూనే ఉంటోంది.

హ‌రీష్ శంక‌ర్ తీస్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా నిజాం డిస్ట్రిబ్యూష‌న్ విష‌యంలో 12.60 కోట్లు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్.. మ‌రో 2 కోట్ల 40 లక్షలు..రిటర్న్ బుల్ అడ్వాన్స్ అని ఆ జ‌ర్న‌లిస్ట్ ట్వీట్ వేసారు. ఈ ట్వీట్‌కి హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ.. మూర్తి గారు నేను మీకు ఇంట‌ర్వ్యూ ఇద్దాం అనుకున్నాను. ద‌య‌చేసి చెడగొట్టుకోకండి. ఇప్ప‌టికైతే ఇది రిక్వెస్ట్ మాత్ర‌మే అన్నారు. దీనికి మూర్తి స్పందిస్తూ.. ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి? డిస్ట్రిబ్యూటర్ చెప్పింది వేయడమా?మీ ఇంటర్వూ నేనేమీ అడగలేదే. నేను తప్పు అంకె వేస్తే ఖండించండి రిక్వెస్ట్ కాదు..వార్నింగ్ అయినా…తప్పు చేస్తే భయపడాలి అని స‌మాధానం ఇచ్చారు.

ఈ గొడ‌వ ఇక్క‌డితో ఆగ‌లేదు. మూర్తి ట్వీట్‌కి హరీష్ శంక‌ర్ స్పందిస్తూ.. మీరు తప్పు చేశారు అని నేను అనుకొని ఉంటే రిక్వెస్ట్ అనే వాడిని కాదు !! లావాదేవీ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో క‌న్ఫామ్ చేసుకోవాలి. మీరు ఒక డిస్ట్రిబ్యూట‌ర్ చెప్పిన‌ట్లు మీరు నా ఇంట‌ర్వ్యూ అడిగార‌ని నాకూ ఒక‌రు చెప్పారు అన్నారు.

దీనికి మూర్తి స్పందిస్తూ.. నేను మీ ఇంటర్వూ కావాలని అడగలేదు. మరోసారి క్లారిటీగా చెబుతున్నా. మీ పీఆర్ ఫోన్ చేసి, హరీష్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వూ ఇస్తారట. కానీ ఆయన కెమేరా కూడా పెట్టుకుంటారట. మీకు ఓకెనా అని అడిగారు. దానికి నేను ఓకె..వన్ సెకెండ్ కూడా కట్ చేయకుండా. అప్‌లోడ్ చేస్తాను అని చెప్పాను. కొన్నవారే ఇంతకు కొన్నాము అని చెప్పింది వేసాను. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్..మీ సినిమా విషయంలో మాత్రమే కాదు. న్యూస్ సేకరించడం అన్నది నా వృత్తి అన్నారు.

ఇందుకు హ‌రీష్ శంక‌ర్ కాస్త గ‌ట్టిగానే క్లాస్ పీకారు. మీరు ఒకసారి ఇంటర్వ్యు ఇస్తా అని ఇవ్వలేదంట అని నాకు ఆ వ్య‌క్తి చెప్పిన‌ప్పుడు సరే … ఈసారి ఆయనతోనే మొదలెడదాం….అన్నాను !!! ఇది నా వైపు నుండి క్లారిటీ !!! ఇక పోతే …. గతంలో “భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ లీక్ చేసిన మీరు తప్పు ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి మీకు సూట్ అవ్వదు. కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోడానికి వివ‌రాలు లీక్ చేసి దాని తాలూకా ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి రావాల్సిన అఫీషియ‌ల్ అప్డేట్ ద్వారా వ‌చ్చే ఫ‌న్‌ని చంపేసే మీలాంటి వాళ్లు తప్పొప్పులు మాట్లాడటం చూస్తే న‌వ్వొస్తోంది.
నేను డైరెక్ట‌ర్‌ని కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నా అని స‌మాధాన‌మిచ్చారు.