Ustaad మరో భీమ్లా నాయకా? జర్నలిస్ట్‌కి క్లాస్‌పీకిన డైరెక్టర్
Hyderabad: డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankar).. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ (ustaad bhagat singh)సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ వేసేసారు. అయితే.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నామనంటూ హరీష్ శంకర్ ఓ ఫొటో పోస్ట్ చేసారు. అందులో క్లాప్‌బోర్డ్ వెనక పవన్ కళ్యాణ్ బొట్టు పెట్టుకుని ఉన్నారు. దాంతో ఇది మరో భీమ్లా నాయక్ అవుతుందా? బొట్టు వెనక విషయం ఏంటి అని ఓ జర్నలిస్ట్ అడిగారు. దాంతో ఆయనకు తన స్టైల్‌లో క్లాస్ పీకారు హరీష్. “బొట్టు ఎవరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అందులో ఏముంది? పోస్టర్స్ వేసేది క్యూరియాసిటీ పెంచడం కోసం. కామెంట్లదీ ఏముందిలెండీ మొన్న ఫస్ట్ పోస్టర్ లో ఉన్నది నేనే అన్నారు, కళ్యాణ్ గారితో సహా అందరం నవ్వుకున్నాం… కామెంట్లని పట్టించుకుంటే సినిమాలు ఎలా తీస్తామండీ ?! నేనూ ఫాన్స్ లో ఒకడ్నే అండీ… కాకపోతే ట్విట్టర్ లో కామెంట్స్ చేసేవాళ్ళంతా ఫాన్స్ అనుకోవడం పొరపాటు” అని క్లారిటీ ఇచ్చారు.