Bobby: ప‌వ‌న్ కోట్లు వ‌దులుకుని.. తిట్లు తింటూ..

Hyderabad: పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి డైరెక్ట‌ర్ బాబి (bobby) చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) న‌టించిన బ్రో (bro) సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా స‌క్సెస్ మీట్ ఏర్పాటుచేసారు. ఈ మీట్‌కు బాబి గెస్ట్‌గా వ‌చ్చారు. కాక‌పోతే పొలిటిక‌ల్ ప‌నుల కార‌ణంగా ప‌వ‌న్ రాలేక‌పోయారు. ఈ సంద‌ర్భంగా బాబీ ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ..

“”  ఈ సినిమాలో ప‌వ‌న్ టైం గురించి చాలా చెప్పారు. టైం చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. చాలా మంది స్వార్ధంతో బతుకుతున్న ఈరోజుల్లో త‌న టైంని జ‌నం కోసం కేటాయిస్తున్నారు. దాని వ‌ల్ల ఆయ‌న‌కు ఒక్క రూపాయి లాభం ఉండ‌దు. ఆయ‌న టైం సినిమాల‌కు ఇస్తే కోట్ల రూపాయ‌లు వ‌స్తాయి. అలాంటి టైంను ఆయ‌న‌ జనానికి ఇస్తూ, వచ్చే కోట్ల రూపాయలు వదులుకుంటూ, తిట్లు తింటూ, ఎండల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు “” అని అన్నారు. ఆయ‌న అలా అన‌గానే డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని, సాయి ధ‌ర‌మ్ తేజ్ క్లాప్స్ కొట్టారు.