Adipurush: సీతమ్మగా ఫీలైతే అలాంటి పనులు చేయరు
Hyderabad: ఆదిపురుష్ (adipurush) సినిమా డైరెక్టర్ ఓం రౌత్, సీతమ్మ క్యారెక్టర్లో నటించిన కృతి సనన్‌ను (kriti sanon) తిరుమలలో ముద్దు పెట్టుకోవడం రచ్చకు దారితీసింది. దీనిపై ఇప్పటికే చాలా మంది మండిపడ్డారు. అయినా కూడా కృతి, ఓం రౌత్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అయితే 90ల్లో వచ్చిన రామాయణం సీరియల్లో సీతమ్మగా నటించిన హిందీ నటి దీపికా చిక్లియా (dipika chiklia) ఈ ఘటనపై స్పందించారు.
“ఈ జనరేషన్ నటులతో ఇదే పెద్ద సమస్య. ఏదైనా క్యారెక్టర్లో నటిస్తున్నప్పుడు తమని తాము అందులో ఊహించుకోరు. కృతి సనన్, ఓం రౌత్‌లకు రామాయణం అనేది కేవలం ఒక సినిమా కావచ్చు. అధ్యాత్మికంగా ఈ సినిమాతో వాళ్లు కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తోంది. ఒకవేళ కృతి సనన్ తనని తాను సీతమ్మవారిలా ఊహించుకుని ఉంటే ఇలా ఆలయంలో ముద్దులు, హగ్స్ లాంటివి చేసేది కాదు. నేను సీతమ్మగా నటిస్తున్నప్పుడు నేనే సీతగా ఫీలయ్యేదాన్ని. ఇప్పుడున్న నటులు అలా కాదు. నేను రామాయణంలో నటిస్తున్నప్పుడు నన్ను కనీసం సెట్లో పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. సీతమ్మా అనే పిలిచేవారు. సెట్స్‌లో నేనే సీతను అనుకుని నా కాళ్లకు నమస్కరించేవారు. ఆదిపురుష్ (adipurush) రిలీజ్ అవ్వగానే ఆ సినిమాలో ఏ క్యారెక్టర్స్‌లో నటించారో వాళ్లు మర్చిపోతారు. కానీ మేం అలా కాదు. ఇప్పటికీ నేను బయట కనిపిస్తే సీతమ్మవారిని ఎలా చూస్తారో అలాగే చూస్తారు” అని తెలిపారు దీపిక.
రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణ సీరియల్లో అరుణ్ గోవిల్, దీపిక చిక్లియా రాముడు సీత పాత్రల్లో నటించారు. ఇటీవల అరుణ్ గోవిల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పుడు చాలా మంది ప్రయాణికులు ఆయన్ను ఇంకా రాముడిగా నే చూస్తూ పాదాలకు నమస్కరిచడం వైరల్‌గా మారింది.