Dimple Hayathi: డైరెక్టర్ నన్ను నమ్మలేదు!
Hyderabad: అందం, టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లు చాలామంది ఉంటారు. ఆ లిస్ట్ లో డింపుల్ హయాతీ(Dimple Hayathi) కూడా ఒకరు. రవితేజ(Raviteja) ఖిలాడీ(Khiladi) సినిమాలో తన అందం, టాలెంట్‌తో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన ఈ భామ.. ప్రస్తుతం గోపీచంద్(Gopichand) హీరోగా తెరకెక్కిన రామబాణం(Rama Banam) సినిమాలో నటించింది. ఈ సినిమా మే 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డింపుల్ హయాతీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం రామబాణం డైరెక్టర్ శ్రీవాస్(Sriwass)పై డింపుల్ హయాతీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
రామబాణం సినిమాలో క్యారెక్టర్ తాను చేయగలనని దర్శకుడు ముందుగా నమ్మలేదు. మొదటిసారి ఆడిషన్స్ చేసినప్పటికీ, రెండోసారి కూడా ఆడిషన్స్ చేశారు. అప్పుడే నా మీద నమ్మకం ఉంచి ఆఫర్ ఇచ్చారు. రామబాణం సినిమాలో నేను యూట్యూబ్ బ్లాగర్ భైరవి క్యారెక్టర్ లో నటించాను. సోషల్ మీడియాపై నాకు పెద్దగా అవగాహన లేదు. అందుకే భైరవి క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా అనిపించింది.
చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న డింపుల్ హయాతీ తన కెరీర్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఖిలాడి మూవీలో నేను గ్లామరస్ రోల్ చేశాను. ఆ సినిమా చూసి నేను భైరవి పాత్రకు సెట్ కానేమో అని దర్శకుడు శ్రీవాస్ సందేహం వ్యక్తం చేశారు. పరిశ్రమకు వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నానని డింపుల్ హయాతీ చెప్పుకొచ్చారు. 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో డింపుల్ హీరోయిన్ అయ్యారు. అనంతరం అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించారు.