Dimple Hayathi: అధికారంతో తప్పులను దాచలేరు!

Hyderabad: రామబాణం(Ramabanam) సినిమా హీరోయిన్ డింపుల్​ హయాతీ(Dimple Hayathi) వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్​ ఆఫీసర్​తో గొడవపడి అతని కారును ఢీ కొట్టిన డింపుల్​పై జూబ్లీహిల్స్​ పోలీసులు క్రిమినల్​ కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ హుడా ఎన్‌క్లేవ్‌లో ఎస్‌కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో డింపుల్ హ‌యాతి త‌న స్నేహితుడు విక్ట‌ర్ డేవిడ్‌తో క‌లిసి ఉంటోంది. అదే అపార్ట్​మెంట్​లో ఉండే ఓ ఐపీఎస్ కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి, కాలుతో తన్నడంతో ఆయన జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు డింపుల్ హ‌యాతి, ఆమె ఫ్రెండ్‌పై క్రిమిన‌ల్ కేసుని న‌మోదు చేశారు. ఈ వార్త నెట్టింట వైరల్​గా మారడంతో తాజాగా దీనిపై డింపుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.
‘అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పుని ఆపలేరు, అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పులని దాచలేరు.. సత్యమేవ జయతే’ అని నవ్వుతూ ఉండే సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది డింపుల్​. దీంతో ఈ విషయంలో తన తప్పేమి లేదు, వాళ్ళ చేతిలో పోలీస్ పవర్ ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా ట్వీట్స్ చేసింది డింపుల్. దీంతో డింపుల్ హయతి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.