Family Star: దిల్ రాజుకు బడ్జెట్ గుబులు
Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు (Dil Raju) దిగులు పడుతున్నారట. ఈ సినిమా షూటింగ్ శనివారంతో ముగిసింది. అయితే షూటింగ్ ముగిసే సమయానికి ఈ సినిమా బడ్జెట్ రూ. 20 కోట్లు పెరిగిపోయింది. ఇదేమీ కమర్షియల్ సినిమా కాదు.
ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాంటి సినిమాకు దాదాపు రూ.90 కోట్లు ఖర్చు అవ్వడంపై దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పరశురామ్ రెమ్యునరేషన్ కాకుండా సినిమాపై వచ్చే ప్రాఫిట్స్ తీసుకుంటామని చెప్పారు. అమెరికాలో షూటింగ్ చేస్తున్న సమయంలో షూటింగ్ డేస్ పెంచాల్సి వచ్చిందట. దాంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ అంతా సెలవుల సీజనే. సో.. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందన్న గట్టి నమ్మకంతో చిత్రబృందం ఉంది.