Game Changer: నా చేతుల్లో ఏమీ లేదు

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (ram charan) న‌టిస్తున్న గేమ్ చేంజర్ (game changer) సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు లేక‌పోవ‌డంపై స్పందించారు నిర్మాత దిల్ రాజు (dil raju). త‌న చేతుల్లో ఏమీ లేద‌ని.. శంక‌ర్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు బ‌య‌టికి వ‌స్తుందేత‌ప్ప తానేమీ చేయ‌లేన‌ని అన్నారు. శంక‌ర్ (shankar) సినిమా వ‌స్తోందంటే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి (rajamouli) లాగానే కంగారులో తీసేయ‌కుండా నిదానంగా టైం తీసుకుని ఒక్కో సినిమాను కంప్లీట్ చేస్తుంటారు శంక‌ర్.

గేమ్ ఛేంజ‌ర్ (game changer) సినిమాలో రామ్ చ‌ర‌ణ్ (ram charan), కియారా అడ్వాణీ (kiara advani) జంట‌గా న‌టిస్తున్నారు. శంక‌ర్ సినిమా అన‌గానే ముందు ప్రొడ్యూస‌ర్లు త‌మ ద‌గ్గ‌ర ఎంత బ‌డ్జెట్ ఉందో ముందే లెక్కేసుకుంటారు. ఎందుకంటే శంకర్ హెవీ బ‌డ్జెట్‌పై డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఈ సినిమాకు (game changer) సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. సినిమాలో ఐదు పాట‌ల కోసం శంక‌ర్ ఏకంగా 90 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ట‌. అంటే డ్యాన్సులు, విజువ‌ల్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయ‌నుకోండి. ప్ర‌భుదేవా లాంటి టాప్ కొరియోగ్రాఫ‌ర్లు ఈ పాట‌ల కోసం ప‌నిచేసార‌ట‌. 350 కోట్లకు పైగానే బ‌డ్జెట్ పెట్టి మ‌రీ తీస్తున్నారు ఈ సినిమాను. ఒక్కసారి ప్ర‌మోష‌న్లు స్టార్ట్ అయితే అప్పుడు ఈ సినిమాను ఎంత గ్రాండ్‌గా తీస్తున్నారో తెలిసిపోతుందని టీం అంటోంది.

కాలేజ్ కుర్రాడిలా చ‌ర‌ణ్ లుక్స్ క్రేజీగా ఉండ‌బోతున్నాయ‌ట‌. ఆ త‌ర్వాత మ‌ధ్య వ‌య‌స్కుడిలా క‌నిపించే లుక్ ఇంకా హైలైట్‌గా ఉండ‌బోతోంద‌ట‌. ఇక చ‌ర‌ణ్ సినిమాలో ఐపీఎస్ ఆఫీస‌ర్ అవ్వాల‌నుకుంటాడ‌ట‌. కానీ అత‌ని కోపం వ‌ల్ల రివాల్వ‌ర్ చేతికిస్తే ఎక్క‌డ అంద‌రికీ చంపేస్తాడోన‌ని బోర్డు అత‌న్ని ఐపీఎస్‌గా ఎంపికచేయ‌ద‌ట‌. అప్పుడు అత‌ను ఐఏఎస్ అవ్వాల‌నుకుంటాడ‌ట‌. అంద‌రూ ఊహించుకునేదానికంటే భారీగానే సినిమా ఉండ‌బోతోందని ఆల్రెడీ కియారా కూడా హైప్ పెంచేసింది.(game changer)