Dil Raju: మేన‌ల్లుడి పెళ్లి.. తార‌క్‌కు ఆహ్వానం

Dil Raju: ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మేన‌ల్లుడు ఆశిష్ రెడ్డి (ashish reddy) త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు, ఆశిష్ రెడ్డితో క‌లిసి జూనియ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) ఇంటికి వెళ్లి మ‌రీ ఆహ్వ‌నించారు. ఫిబ్ర‌వ‌రి 14న జైపూర్‌లో ఆశిష్ రెడ్డి వివాహం అద్వితా రెడ్డితో జ‌ర‌గ‌నుంది. రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి సెల్ఫిష్ అనే మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు.