Chiranjeevi సినిమాకు నో చెప్పిన సిద్ధూ?

Hyderabad: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ (siddu jonnalagadda).. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సినిమాకు నో చెప్పిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. చిరు కోసం క‌ళ్యాణ్ కృష్ణ (kalyan krishna) ఓ స్క్రిప్ట్ రెడీ చేసారు. ఇందులో సిద్ధుని సెకండ్ హీరోగా పెడితే బాగుంటుంద‌ని క‌ళ్యాణ్ అనుకున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని సిద్ధుకి చెప్పి స్టోరీ చెప్ప‌డానికి వెళ్తే సిద్ధూ నో చెప్పార‌ని తెలుస్తోంది. డీజే టిల్లు (dj tillu) సినిమాతో ఇప్పుడిప్పుడే మంచి ట్రాక్‌లో ఉన్న సిద్ధూకి సెకండ్ హీరోగా చేయ‌డం ఇష్టం లేక‌నే నో చెప్పార‌ని స‌మాచారం.

చిరు 156వ సినిమాను హ‌రీష్ కళ్యాణ్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఇప్పుడు ఇద్ద‌రు హీరోల‌తో సినిమాలు కామన్ అయిపోయాయి. ఇద్ద‌రు హీరోలుంటే ఇద్ద‌రి ఫ్యాన్స్ సినిమా చూడ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తార‌ని డైరెక్ట‌ర్స్ అనుకుంటున్నారు. వాల్తేరు వీర‌య్య‌లోనూ (waltair veerayya) చిరుతో పాటు మాస్ మ‌హారాజా ర‌వితేజ (ravi teja) న‌టించ‌డం క‌లిసొచ్చింది. అందుకే హ‌రీష్ క‌ళ్యాణ్ క్రేజ్ ఉన్న హీరోని తీసుకోవాల‌నుకున్నారు. సిద్ధు ఉంటే బాగుంటుంద‌ని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కానీ ఆయ‌న నో చెప్ప‌డంతో ఇప్పుడు అంతే క్రేజ్ ఉన్న యంగ్ హీరోని పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌.