Samantha: చై టాటూ తీసేసిన సామ్‌..!

స‌మంత (samantha) నాగ చైత‌న్య (naga chaitanya) ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు.. చై మీద ఇష్టంతో న‌డుము పై భాగంలో సామ్ చై అని టాటూ వేయించుకుంది. వీరిద్ద‌రూ విడిపోయిన త‌ర్వాత ఓ సంద‌ర్భంలో ఎప్పుడూ కూడా టాటూలు వేయించుకోకండి అని ఫ్యాన్స్‌కి స‌ల‌హా కూడా ఇచ్చింది. అయితే సామ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు చూస్తే ఆ టాటూని ఎరేజ్ చేయించేసిన‌ట్లు తెలుస్తోంది. టాటూ తీయించేసాను అని చెప్ప‌డానికే సామ్ ఈ పోజుల్లో ఫోటోలు దిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే టాటూని ఎరేజ్ చేయించేసారా.. లేక మేక‌ప్‌తో క‌వ‌ర్ చేసారా అనేది సమంతే చెప్పాలి.