Sai Pallavi పెళ్లి చేసుకుందా..?
పై ఫోటో చూడగానే సాయి పల్లవి (sai pallavi) పెళ్లి చేసేసుకుందా అనిపించేలా ఉంది కదా..! కానీ అది నిజం కాదు. తమిళనాడులో ఏదైనా సినిమా ప్రారంభించే ముందు పూజ చేసాక అలా మెడలో పూల మాలలు వేసి ఆశీర్వదిస్తారట. ఓ తమిళ నెటిజన్ ఈ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. సాయి పల్లవి రహస్యంగా పెళ్లి చేసేసుకుందని.. ప్రేమకు రంగుతో పనిలేదని మంచి మనసు ఉంటే చాలని ఆయన సొంత కావ్యం రాసేసుకున్నాడు. ఆ తర్వాత తమిళ పబ్లిసిస్ట్ ఒకరు అసలైన ఫోటోను పోస్ట్ చేస్తూ కొత్త సినిమా సమయంలో తీసిన ఫోటో రా బాబు అది క్లారిటీ ఇచ్చాడు.