Coolie: కూలీ షూటింగ్ వ‌ల్ల ర‌జినీకి అస్వ‌స్థ‌త‌?

did rajinikanth had health issue during coolie shoot

Coolie: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు స్టెంట్ వేసిన‌ట్లు వైద్యులు తెలిపారు. నిన్న త‌లైవా పూర్తి ఆరోగ్యంతో హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే.. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవా ర‌జినీకాంత్ కూలీ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వ‌ల్లే ర‌జినీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని త‌మిళ‌నాట ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై లోకేష్ స్పందించారు. త‌న‌కు స‌ర్జ‌రీ చేస్తార‌ని ర‌జినీ నెల రోజుల ముందే చెప్పార‌ని.. ఆయ‌న‌కు షూటింగ్‌లో కాస్త అల‌స‌ట‌గా అనిపించినా షూటింగే మొత్తానికి ఆపించేసేవాడిన‌ని అన్నారు. త‌న‌కు త‌లైవా ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాద‌ని.. ఆయ‌న పూర్తిగా కోలుకున్నాకే కూలీ షూటింగ్ కొన‌సాగిస్తామ‌ని వెల్ల‌డించారు.