Janhvi Kapoor: ఊ అందా.. ఊఊ అందా?

Janhvi Kapoor: జాన్వి క‌పూర్‌కి టాలీవుడ్‌లో క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్ప‌టికే దేవ‌ర (Devara) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న జాన్వి.. ఈ సినిమా రిలీజ్ అవ్వ‌కుండానే రామ్ చ‌ర‌ణ్‌తో (Ram Charan) క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతోంది. సినిమాలే కాదు.. స్పెష‌ల్ సాంగ్స్‌కి కూడా ఓకే చెప్పేస్తోంద‌ట‌. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టిస్తున్న పుష్ప 2 (pushpa 2) సినిమాలో ఐటెం డ్యాన్స్ చేసేందుకు టీం జాన్వి క‌పూర్‌ని సంప్ర‌దించార‌ట‌. పుష్ప: ది రైజ్‌లో (Pushpa: The Rise) స‌మంత ఊ అంటావా.. ఊఊ అంటావా అంటూ ఇర‌గ‌దీసింది. ఈ సాంగ్ చార్ట్‌బ‌స్ట‌ర్ అయిపోయింది. ఇప్పుడు స‌మంత స్థానంలో జాన్వి క‌పూర్ ఐటెం డ్యాన్స్ చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి దీని అమ్మ‌డు ఊ అందో ఊఊ అందో తెలియాల్సి ఉంది.

ALSO READ: Janhvi Kapoor: దేవ‌ర రాకుండానే ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌నా?

ALSO READ: ఎన్టీఆర్‌కి నా డ్యాన్స్ న‌చ్చింది.. దేవ‌ర‌లో ఒక్క ఛాన్స్..!