Chiranjeevi: చిరు చురకలు.. పార్ట్ 2
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్‌లో (waltair veerayya 200 days function) YSRCPని దుమ్ము దులిపేసారు. ఆయన అంటించిన చురకలు చాలా మందికి చాలా ఘాటుగా గుచ్చుకున్నాయ్. అయితే అదే ఈవెంట్‌లో చిరు ఒక మాట అన్నారు. అది ఎవరి గురించి అయ్యుంటుందో అంటూ నెటిజన్లు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. ఇంతకీ చిరు ఏమన్నారంటే.. నాకు నచ్చని మరో మాట ఏంటంటే..ఆ రోజుల్లో మేము అనే మాట నాకు అస్సలు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈరోజన నువ్వేమీ లేవు అని అర్థం. అందుకే ఆ మాట అనొద్దు అని అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో చిరుకే తెలియాలి.