Anirudh Ravichander: అనిరుధ్.. ఆఖరికి నువ్వు కూడానా?
ఈ మధ్యకాలంలో మ్యూజిక్ విషయంలో బాగా పాపులర్ అయ్యింది అనిరుధ్ రవిచందరే (anirudh ravichander). అనిరుధ్ మ్యూజిక్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అతని వర్త్ అలాంటిది కాబట్టి టాలీవుడ్ వారు కూడా తెలుగు కంపోజర్లను పక్కనపెట్టి అనిరుధ్ కావాలని అంటున్నారు. ఇక కొన్ని నెలల క్రితం రిలీజైన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కూడా అనిరుధ్ మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పుకోవాలి.
అలాంటి అనిరుధ్.. ఇటీవల రిలీజైన లియో సినిమాకు అందించిన మ్యూజిక్‌ని కాపీ కొట్టాడని ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖ ఇంగ్లీష్ మ్యూజిషియన్ అయిన ఆట్నికా (otnicka) మ్యూజిక్‌ని అనిరుధ్ కాపీ కొట్టి లియోలో (leo) వాడాడని అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు అనిరుధ్ స్పందించలేదు కానీ ఆట్నికా స్పందించారు. “” హాయ్ ఫ్రెండ్స్. నా మ్యూజిక్ విషయంలో వస్తున్న వార్తలు నేను చూస్తున్నాను. నాకు వేలల్లో మెసేజ్‌లు, కాల్స్, నా యూట్యూబ్ చానెల్‌లో కామెంట్స్ వస్తున్నాయి. అయితే దీనిపై నేను ఇప్పుడే స్పందించలేను. నేను ఎవ్వరిపైనా నిందలు కూడా వేయలేను. అసలు మ్యాటర్ ఏంటో నాకు ఇంకా క్లియర్‌గా తెలీదు. దీనిపై నా టీం విచారణ చేస్తోంది. త్వరలో నా సమాధానం చెప్తాను“” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
సాధారణంగా అనిరుధ్ ఎవరి మ్యూజిక్ కాపీ కొట్టడని.. సొంతంగా కంపోజ్ చేస్తూ తన మ్యూజిక్‌తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంటాడని ఆడియన్స్‌లో మంచి పేరు ఉంది. అలాంటి అనిరుధ్ కూడా చివరికి పక్కవారి ట్యూన్స్ కాపీ కొడుతున్నాడని ఆరోపణలు వస్తుండడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. (anirudh ravichander)