Adipurush: తిరుమలలో ఈ ముద్దులేంటి?
Hyderabad: ఆదిపురుష్ (adipurush) డైరెక్టర్ ఓం రౌత్ హీరోయిన్ కృతి సనన్‌ని (kriti sanon) ముద్దుపెట్టుకున్నారా? అవుననే అంటున్నాయి బయటికొచ్చిన కొన్ని ఫొటోలు. ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం టీం అంతా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక కృతికి బై చెప్తూ ఓం రౌత్ (om raut) ఆమె బుగ్గపై ముద్దిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై BJP రాష్ట్ర సెక్రటరీ రమేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
“పవిత్రమైన శ్రీవారి ఆలయంలో మీ రొమాంటిక్ ప్రదర్శనలు అవసరమా? ఇలా శ్రీవారి ఆలయంలో ముద్దులు, కౌగిలింతలు వంటివి చేస్తే అస్సలు సహించం” అని ట్వీట్ చేసారు. ఏమైందో ఏమో ఆ ట్వీట్‌ని కాసేపటికే డిలీట్ చేసారు. అప్పటికే ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అయిపోయింది. దీనిపై ఓం రౌత్, కృతి సనన్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి. మామూలుగా గుడ్ బై చెప్పుకునేటప్పుడు డైరెక్టర్లు, హీరోయిన్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు హగ్స్ ఇచ్చుకోవడం, బుగ్గపై కిస్ ఇచ్చుకోవడం కామనే. కానీ అవి బయట చేస్తే బాగుంటుంది. ఇలా ఎంతో పవిత్రమైన శ్రీవారి ఆలయంలో ఇలాంటి పనులు చేయడం సబబు కాదు.