Dhruva Sarja: నాలో టాలెంట్ లేకపోతే నా సినిమాలు చూడకండి
Dhruva Sarja: విలక్షణ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జ మార్టిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అర్జున్, ధృవ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధృవ మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి.
“” చాలా మంది బయటి వారు సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో చాలా మందికి టాలెంట్ ఉంది. ఒకవేళ మీరు నాలో టాలెంట్ లేదు.. నేను నెపోటిజం బ్యాచ్ అనుకుంటే మీరు నా సినిమాలు చూడకండి. నా సినిమాలను ఎంకరేజ్ చేయకండి. నేను మార్టిన్ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాను. నా కష్టం మీకు సినిమాలో కనిపిస్తే.. నాలో కూడా మా మామయ్య లాగా టాలెంట్ ఉందని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా సినిమా చూడమని చెప్పండి. మీకు సమయం ఉంటేనే నా సినిమాకు వెళ్లండి “” అని ధృవ ఎంతో హుందాగా మాట్లాడిన మాటలకు మీడియా వర్గాలు చప్పట్లు కొట్టాయి.