Dhanush: బాబోయ్ ఈయ‌న ధ‌నుషా..?

Hyderabad: త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్ (dhanush) న్యూ లుక్ షాకింగ్‌గా ఉంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ధ‌నుష్ (dhanush) క‌నిపించ‌డంతో ప్ర‌ముఖ ముంబై సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ విరాల్ భ‌యానీ ఆయ‌న ఫొటోలు తీసాడు. అవి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. చాలా మంది ఈయ‌న ధ‌నుష్ ఏంటి రామ్‌దేవ్ బాబా క‌దా అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్ (captain miller) అనే సినిమాలో న‌టిస్తున్నారు. బ‌హుశా ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త లుక్ మెయింటైన్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఈ సినిమాలో ఆయ‌న తండ్రి, కుమారుడి పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అరుణ్ మ‌థేశ్వ‌ర‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా.. సార్ (sir) సినిమాలో ధ‌నుష్‌ని హ్యాండ్స‌మ్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇలా చూడాలంటే కాస్త ఇబ్బందిప‌డుతున్నారు.