Bandla Ganesh: దేవ‌ర టైటిల్ నాది.. కొట్టేసారు!

Hyderabad: దేవర(devara) టైటిల్‌పై ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్(bandla ganesh) షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇది త‌న టైటిల్ అని, రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నా కూడా కొట్టేసార‌ని మండిపడ్డారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr), కొర‌టాల శివ(koratala siva) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న NTR30 సినిమాకు దేవ‌ర(devara) అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేసారు. ఈరోజు రాత్రి 7:02కి టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్(bandla ganesh) ఇలా అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాసేప‌టికే “నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే” అని మ‌రో ట్వీట్ చేసారు.