Deepika Padukone: తల్లి కాబోతున్న దీపిక..!
Deepika Padukone: బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణె ఎట్టకేలకు శుభవార్తను రివీల్ చేసేసారు. కొంతకాలంగా దీపిక తల్లి కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె ఈరోజు స్పందించారు. తాను రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు. సెప్టెంబర్‌లో తమకు పండంటి బిడ్డ పుట్టబోతోందని తెలిపారు. (Deepika Padukone)
దీపిక, రణ్‌వీర్‌ల ప్రేమ కథ
దీపిక పదుకొణె రణ్‌వీర్ సింగ్‌లు గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా (Goliyon Ki Raslila Ramleela) సినిమాలో తొలిసారి కలిసి నటించారు. సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా మారింది. ఈ సినిమా తర్వాతే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2015లో ఎవ్వరికీ తెలీకుండా నిశ్చితార్ధం చేసేసుకున్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ విషయాన్ని దాచిపెట్టారు.
ఆ తర్వాత దీపిక, రణ్‌వీర్ బాజీరావు మస్తానీ (Bajirao mastani) సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇద్దరూ కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) టాక్ షోకి గెస్ట్‌లుగా వెళ్లారు. ఆ సమయంలో నిర్మాత కరణ్ జోహార్ మీరు డేటింగ్‌లో ఉన్నారా అని నేరుగా అడిగేసారు. అప్పుడు రణ్‌వీర్ తాను దీపికకు 2015లో ప్రపోజ్ చేసానని ఒప్పేసుకున్నారు. కానీ నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
2018లో ఒక్కటై..!
దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు 2018 నవంబర్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో వేదికగా వీరిద్దరూ హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి దీపిక, రణ్‌వీర్‌లు ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. గతేడాది నవంబర్‌లో తమ ఐదో వెడ్డింగ్ యానివర్సరీని బెల్జియంలో సెలబ్రేట్ చేసుకున్నారు. దీపిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటంతో వీరిద్దరూ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మినిస్తారేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ దీపిక తానంతట తనే బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో తమ ఫిజిక్ ఎక్కడ పోతుందోనని అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని కనేస్తున్నారు. పైకి మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. (Deepika Padukone)
ALSO READ: Kalki 2898 AD: వామ్మో ఇది బడ్జెటా.. కలెక్షన్సా..?
విడాకులని ప్రచారం..!
ఈ మధ్యకాలంలో కొన్ని జంటలను చూస్తుంటే వివాహ వ్యవస్థపైనే నమ్మకం పోతోంది. కానీ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌ల ప్రేమను చూస్తే ఇంకా ఇలాంటి ప్రేమ జంటలు ఉన్నాయా అనిపిస్తుంది. వీరిని చూస్తే ప్రేమించాలన్న హోప్ వస్తుంది. అలాంటిది ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న చర్చ బాలీవుడ్‌లో మొదలైంది. ఇది చాలా మందికి షాకింగ్ విషయంగా మారింది. నెటిజన్లు అయితే.. దీపిక, రణ్‌వీర్‌లు విడాకులు తీసుకుంటే ఇక జీవితంలో తాము ఎవ్వరినీ ప్రేమించలేం అని కామెంట్స్ పెట్టేవారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వారిద్దరూ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కల్కితో తెలుగులో ఎంట్రీ..!
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది దీపిక పదుకొణె. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది.