ఎన్టీఆర్ సాబ్.. 2034లో మీరే ముఖ్యమంత్రి
JR NTR: ఎన్టీఆర్ సాబ్.. 2034లో మీరే ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ మాట అక్బర్ బిన్ తబర్ (Akbar Bin Tabar) అనే నటుడు తారక్‌తో అన్నవి. మొన్న రంజాన్ పండుగ సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు తారక్ కూడా వెళ్లారు. ఈ విందులో ముంబైకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నటీనటులు హాజరయ్యారు. ఆ సమయంలో అక్బర్ తారక్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“” హైదరాబాద్‌లో గోల్డొండ కోట వద్ద ఓసారి మీ తాతగారు నందమూరి తారక రామారావు గారు వచ్చారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా.. 2034లో మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీ తాతగారు గోల్డొండ కోటకు వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ముస్లింలు ఉన్నారు. వారందరికీ మీ తాతగారంటే ఎంతో ఇష్టం. ఆయన మాటల్లో ఎంతో గాంభీర్యం ఉండేది. ఇప్పుడు మీ వాయిస్ కూడా అలాగే ఉంది. చాలా మంది మీ తాతగారిని మీలోనే చూసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో సూపర్స్టార్లు ఉన్నారు. వారందరికీ మీరు బాప్ లాంటివారు “” అన్నారు. అది విని ఎన్టీఆర్ కూడా చిరునవ్వులు చిందించారు.